భారతదేశం, సెప్టెంబర్ 11 -- Tamanna Traditional Look In Chhath Puja Song: బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తొలిసారిగా జోడీ కట్టిన చిత్రం 'వాన్: ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్' (Vvaan: Force of the Forest). దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫాంటసీ మిస్టరీ థ్రిల్లర్ సినిమాపై బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రమోషన్లలో భాగంగా గురువారం (సెప్టెంబర్ 10) రోజున ఈ సినిమా నుంచి 'ఛటీ మైయా' (Chhathi Maiya) అనే దైవికమైన పాటను మేకర్స్ విడుదల చేశారు. సుమారు 3 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా తమన్నా ట్రెడిషనల్‌గా కనిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా .. తమన్నా భక్తిని, ఆమె నమ్మకాలను ప్రశ్నించే దృశ్యంతో పాట ప్రా...