భారతదేశం, మే 23 -- Director VV Vinayak Launch Takshaka Movie Poster: మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చిత్రాన్ని రూపొందిస్తున్న ప్రముఖ దర్శకుడు వశిష్ట మల్లిడి సోదరుడు కృష్ణ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న సినిమా "తక్షక". ఈ చిత్రంలో కుశాల్ రాజు హీరోగా పరిచయమవుతున్నారు. ఎంఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పై డా. లతా రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సైన్స్ ఫిక్షన్ డ్రామా కథతో రూపొందుతున్న "తక్షక" సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రానుంది. తాజాగా తక్షక చిత్ర పోస్టర్‌ను స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ వీవీ వినాయక్ మాట్లాడుతూ.. "మల్లిడి సత్యనారాయణరెడ్డి గారి కుటుంబంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. వారి కుటుంబం నుంచి దర్శకుడిగా మారుతున్నారు కృష్ణ మల్లిడి. చిన్నప్పటి నుంచి నాకు ఎంతో తెలిసిన కు...