T-Fiber Internet : సెప్టెంబర్ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్
భారతదేశం, ఆగస్టు 4 -- తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్నెట్ సేవలను కేవలం టీ-ఫైబర్ ద్వారానే అందించేలా చూడాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. టీ-ఫైబర్ సేవల విస్తరణకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
అంతేకాకుండా సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోకూడదని, వాటికి బిల్లులు చెల్లించకూడదని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ నిధులను ఆదా చేయడం, ఏకీకృత డిజిటల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.