భారతదేశం, ఆగస్టు 4 -- తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్నెట్ సేవలను కేవలం టీ-ఫైబర్ ద్వారానే అందించేలా చూడాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. టీ-ఫైబర్ సేవల విస్తరణకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్దేశిత కాలపరిమితిలోగా రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి టీ-ఫైబర్ కనెక్టివిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.

అంతేకాకుండా సెప్టెంబర్ 1 తర్వాత ఏ ప్రభుత్వ శాఖ కూడా ప్రైవేట్ ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోకూడదని, వాటికి బిల్లులు చెల్లించకూడదని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ నిధులను ఆదా చేయడం, ఏకీకృత డిజిటల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు....