భారతదేశం, మార్చి 26 -- ప్రజ్వలా లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్‌గా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సుయోధన. ఈ సినిమాలో డైలాగ్ కింగ్ సాయి కుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించారు. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మించారు.

సుయోధన సినిమా ఈ నెల 27న అంటే రేపే ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ సుయోధన సినిమాను విడుదల చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా ఇవాళ (మార్చి 26) సుయోధన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు సాయి కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

యాక్టర్ సాయి కుమార్ మాట్లాడుతూ.. "నేను 1972లో దుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయ...