భారతదేశం, మే 17 -- Suriya Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన క్రేజీ ప్రాజెక్ట్ 'కరుప్పు' ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల నుంచి ఈ చిత్రానికి ఊహించని స్థాయిలో ఆదరణ, ప్రశంసలు లభిస్తున్నాయి. థియేటర్లలో ప్రేక్షకులు అందిస్తున్న ఈ అపూర్వమైన ప్రేమ, ఘన విజయంపై హీరో సూర్య ఎమోషనల్ అయ్యాడు. సినిమాను ఇంతటి బ్లాక్‌బస్టర్‌గా మార్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతూనే, ఈ ప్రాజెక్ట్ కోసం రాత్రింబవళ్లు కష్టపడిన తన చిత్ర బృందాన్ని ఆయన పేరుపేరునా అభినందించాడు.

"ప్రపంచవ్యాప్తంగా మాకు లభిస్తున్న ఈ ప్రేమ, పేరు ప్రఖ్యాతులు కేవలం 'కరుప్పు' చిత్ర యూనిట్ కష్టానికి దక్కిన ప్రతిఫలం. కథను నమ్మి ప్రతి ఒక్కరూ ఎంతో శ్రమించారు. ఈ సినిమాకు అండగా నిలిచిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ప్రభు ...