భారతదేశం, మార్చి 24 -- మతం మార్పిడి విషయంలో ఎస్సీ హోదాకు సంబంధించి సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. క్రిస్టియన్ మతంలోకి మారాక ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం చేసింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని నొక్కి చెప్పింది. ఓ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ మేరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మసనం ఈ కీలక తీర్పును మంగళవారం వెలువరించింది.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ. కీలక అంశాలను ప్రస్తావించింది. హిందూ, సిక్కు మతం లేదా బౌద్ధమతం కాకుండా వేరే మతాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఎస్సీ సభ్యులకు అందుబాటులో ఉన్న రాజ్యాంగ రక్షణలను క్లెయిమ్ చేయలేరని పేర్కొంది. ఒక వ్యక్తి స్వచ్ఛందంగా మతం మార్చుకుని మరొక మతాన్ని చు...