భారతదేశం, సెప్టెంబర్ 29 -- Sundeep Kishan: తమిళనాడు సీఎం విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'సిగ్మా' (Sigma). ఈ మూవీ ఈ శుక్రవారం (అక్టోబర్ 2) థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న యంగ్ హీరో సందీప్ కిషన్ షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ అనుభవాన్ని బయటపెట్టాడు.

సిగ్మా సినిమా ప్రమోషన్లలో హీరో సందీప్ కిషన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. సదరు దర్శకుడి పేరు చెప్పడానికి నిరాకరించిన సందీప్, గతంలో ఓ సినిమా సెట్స్‌లో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు.

''షూటింగ్ ప్రారంభమైన రెండో రోజే ఆ కొత్త దర్శకుడు అందరి ముందూ ఏడవడం మొదలెట్టాడు. తనకు అసలు డైరెక్షన్ ఎలా చేయాలో తెలియడం లేదని చెప్పాడు. అప్పుడు ఎలా రియాక్టవలో నా...