భారతదేశం, అక్టోబర్ 31 -- Actress Sunainaa Against AI Misuse: సినీ రంగాన్ని, మహిళా నటీమణులను కృత్రిమ మేధ (AI) రూపంలో కొత్త తరహా ముప్పు తీవ్రంగా వేధిస్తోంది. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు డీప్‌ఫేక్ మార్ఫింగ్ వీడియోల బారిన పడి తీవ్ర మనోవేదనకు గురైన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు హీరోయిన్ సునైనా యెల్లా సైతం తీవ్రమైన సైబర్ వేధింపులకు గురయ్యారు. సోషల్ మీడియాలో తన రూపాన్ని దుర్వినియోగం చేస్తూ తయారు చేసిన ఒక అశ్లీల ఏఐ వీడియో వైరల్ కావడంపై ఆమె గట్టిగా స్పందించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసిన సునైనా తాజాగా మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సైబర్ క్రిమినల్స్ వైఖరిపై విరుచుకుపడ్డారు.

తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా రూపొందించిన ఈ నకిలీ వీడియోను చూసి తాను తీవ్రంగా అసహ్యించుకున్నానని సునైనా తెలిపారు. "స్త్రీల భద్ర...