భారతదేశం, మే 14 -- Summer Special Trains 2026 : వేసవి సెలవుల వేళ ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల ఇబ్బందులను తొలగించేందుకు, అదనపు రద్దీని క్లియర్ చేసేందుకు గాను వివిధ గమ్యస్థానాల మధ్య మరిన్ని 'సమ్మర్ స్పెషల్' రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా నాందేడ్స విశాఖపట్నం నుంచి ఢిల్లీ (నిజాముద్దీన్) వైపు వెళ్లే వారికి ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది.

మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

విశాఖపట్నం నుంచి నిజాముద్దీన్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయి.

ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకుని తమ ప్రయాణాలను సురక్ష...