భారతదేశం, నవంబర్ 29 -- Sukumar Loses 1 Crore Challenge Allu Aravind: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్లకు ఎప్పుడూ కొత్త దారులు వెతికే అగ్ర నిర్మాత అల్లు అరవింద్.. తాజాగా 'పుష్ప' దర్శకుడు సుకుమార్‌కు విసిరిన ఓ ఆసక్తికర ఛాలెంజ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దుల్కర్ సల్మాన్, కొత్త నటి సాత్విక వీరవల్లి జంటగా నటించిన సైన్స్ ఫిక్షన్ డ్రామా 'ఆకాశంలో ఒక తార' నవంబర్ 20న థియేటర్లలో విడుదలైంది.

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో వచ్చిన ఈ చిత్రాన్ని చూస్తూ ఒక్క చుక్క కన్నీరు కూడా కార్చకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే రూ.కోటి ఇస్తానని అరవింద్ పందెం కాశారు. కానీ, ఆకాశంలో ఒక తార సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలకు సుకుమార్ కరిగిపోయి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఈ ఛాలెంజ్‌లో ఓడిపోయారు.

తన ఓటమిని అంగీకరిస్తూ సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అల్లు అరవింద్ ఫోటోతో ...