భారతదేశం, జూన్ 25 -- Sukumar Priyadarshi Idupu Kayitham Launch: 'పుష్ప' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్.. కేవలం సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, తన 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌పై వైవిధ్యమైన కథలను ప్రోత్సహిస్తూ నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సుకుమార్ చేయనున్న తదుపరి ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లడానికి కాస్త సమయం పడుతుండటంతో, ఈ గ్యాప్‌లో వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో టాలీవుడ్‌లో తెలంగాణ నేటివిటీతో వస్తున్న సినిమాలకు ఆదరణ విపరీతంగా పెరిగింది.

'బలగం' లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన విజయాలు రూటెడ్ కథలకు ఉన్న డిమాండ్‌ను నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలో, పక్కా గ్రామీణ నేపథ్యంలో సరికొత్త ఫ్యామిలీ డ్రామాను సుకుమార్ ప్రేక...