భారతదేశం, ఆగస్టు 19 -- Suhas Mandadi: వెరైటీ కాన్సెప్ట్ సినిమాలు, నేచురల్ పెర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుహాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ 'మండాడి' నుంచి బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ డ్రామాలో సుహాస్ మునుపెన్నడూ చూడని ఇంటెన్స్, మాస్ అవతార్‌లో కనిపిస్తుండగా, సినిమా గ్రాండ్ రిలీజ్ డేట్‌ను కూడా ఆఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

RS ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్‌పై ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని మతిమారన్ పుగళేంది డైరెక్ట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కల్ట్ డైరెక్టర్ వెట్రిమారన్ ఈ ప్రాజెక్ట్‌కి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.

సుహాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పోస్టర్‌లో సుహాస్ ఒత్...