భారతదేశం, ఏప్రిల్ 28 -- అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల మధ్య తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్న సూచీలు సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 639 పాయింట్లు పెరిగి 77,304 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 195 పాయింట్లు వృద్ధిచెంది 24,093 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 174 పాయింట్లు పెరిగి 56,264 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,152 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,124 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"ప్రస్తుతం మార్కెట్​లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి. స్టాక్​-స్పెసిఫిక్​ అప్రోచ్​ తీసుకోవడం...