భారతదేశం, మే 13 -- అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా దేశీయ స్టాక్​ మార్కెట్​లు గత కొన్ని ట్రేడింగ్​ సెషన్​లలో పడుతూనే ఉన్నాయి. మంగళవారం సైతం సూచీలు భారీగా నష్టపోయాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1456 పాయింట్లు పడి 74,559 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 436 పాయింట్లు కోల్పోయి 23,380 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 885 పాయింట్లు పడి 53,555 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,959.39 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 7,990.32 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 66 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో బలమైన బేర్​ క్యాండిల్​ ఏర్పడింది. ఫ...