భారతదేశం, మార్చి 4 -- పశ్చిమాశియాలో ఇరాన్​- అమెరికా, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ తరుణంలోనే దేశీయ స్టాక్​ మార్కెట్​లు సైతం బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.

బీఎస్​ఈ సెన్సెక్స్​ 1694 పాయింట్లు పడి 78.545 వద్ద ప్రారంభమైంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ50 477 పాయింట్లు కోల్పోయి 24,389 వద్ద ట్రేడింగ్​ సెషన్​ని మొదలుపెట్టింది.

ఒకానొక సందర్భంలో సెన్సెక్స్​ 1,750 పాయింట్లు కోల్పోయి 78,481 వద్ద ఇంట్రాడే- లోని నమోదు చేసింది. నిఫ్టీ50 ఏకంగా 500 పాయింట్లు డౌన్​ అయ్యి 24,335కి కూడా చేరింది.

సెన్సెక్స్​30లో 4 ఐటీ స్టాక్స్​లు (ఇన్ఫోసిస్​, టీసీఎస్​, హెచ్​సీఎల్​టెక్​, టెక్​ఎం) మినహా అన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్​ అండ్​ టీ 6శాతం నష్టపోగా, టాటా స్టీల్​ దాదాపు 4శాతం ...