భారతదేశం, జూలై 9 -- అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల మళ్లీ కమ్ముకున్న వేళ బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1677 పాయింట్లు పడి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1458 పాయింట్లు పడి 56,743 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,962.80 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 790.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో భారీ బేర్​ క్యాండిల్​ ఏర్పటింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్​ సె...