భారతదేశం, అక్టోబర్ 8 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 429 పాయింట్లు పడి 72,639 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 173 పాయింట్లు కోల్పోయి 22,603 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 73 పాయింట్లు పడి 55,056 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 6,121.37 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,596.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50లో రివర్సల్​కి సంకేతాలు కనిపిస్తున్నాయి. రానున్న కొన్ని రోజులు చాలా కీలకం. 22,600 లెవల్​ కన్నా దిగువకు పడితే సూచీపై బేర్ల పట్టు పెర...