Stock Market : బాబోయ్.. స్టాక్ మార్కెట్లకు ఈరోజు కూడా నష్టాలే! లాభాలు చూసేదెప్పుడు?
భారతదేశం, జూన్ 2 -- సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 508 పాయింట్లు పడి 74,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 165 పాయింట్లు కోల్పోయి 23,383 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 596 పాయింట్లు పడి 53,643 వద్దకు చేరింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,911.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,109.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"భారత స్టాక్ మార్కెట్లు షార్ట్ టర్మ్‌లో రేంజ్ బౌండ్ నుంచి నెగిటివ్‌గా ఉండొచ్చు. ఎఫ్ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితి ఇందుకు కారణం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.