భారతదేశం, జూన్ 2 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 508 పాయింట్లు పడి 74,267 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 165 పాయింట్లు కోల్పోయి 23,383 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 596 పాయింట్లు పడి 53,643 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,911.68 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,109.13 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్ భారీ​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 215 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"భారత స్టాక్​ మార్కెట్​లు షార్ట్​ టర్మ్​లో రేంజ్​ బౌండ్​ నుంచి నెగిటివ్​గా ఉండొచ్చు. ఎఫ్​ఐఐల అమ్మకాలు, అంతర్జాతీయ అనిశ్చితి ఇందుకు కారణం....