Stock market : బాబోయ్ 'క్రూడ్'! భగభగలాడుతున్న చమురు ధర- ఈరోజు స్టాక్ మార్కెట్ డౌన్?
భారతదేశం, అక్టోబర్ 26 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 126 పాయింట్లు పడి 73,124 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 22,600 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 638 పాయింట్లు పడి 54,287 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 887.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,235.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
"నిఫ్టీ50కి 22,300 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత కిందకి పడిపోవచ్చు. 22,000 వరకు వెళ్లొచ్చు. ఇది కీలకమైన సైకలాజిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.