భారతదేశం, అక్టోబర్ 26 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 126 పాయింట్లు పడి 73,124 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 88 పాయింట్లు కోల్పోయి 22,600 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 638 పాయింట్లు పడి 54,287 వద్దకు చేరింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 887.65 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,235.36 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 75 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 22,300 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ మరింత కిందకి పడిపోవచ్చు. 22,000 వరకు వెళ్లొచ్చు. ఇది కీలకమైన సైకలాజిక...