భారతదేశం, జూలై 14 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 47 పాయింట్లు పెరిగి 77,616 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు వృద్ధిచెంది 24,211 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 86 పాయింట్లు పెరిగి 58,132 వద్దకు చేరింది.

ముడి చమురు ధర నెల రోజుల గరిష్ఠానికి చేరడంతో ప్రపంచ స్టాక్​ మార్కెట్ ఇన్వెస్టర్లలో భయాందోళనలు నెలకొన్నాయి. ఫలితంగా సూచీలు పడుతున్నాయి.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,062.27 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,171.70 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణ...