భారతదేశం, నవంబర్ 20 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 990 పాయింట్లు పెరిగి 83,022 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 286 పాయింట్లు వృద్ధిచెంది 25,514 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1024 పాయింట్లు పెరిగి 63,063 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో డీఐఐలు రూ. 1,356.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్​ఐఐలు రూ. 7,411.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 బుల్లిష్​గా దూసుకెళుతోంది. 25,500 లెవల్​ని సస్టైన్ చేయగలిగితే సూచీ 25,900- 26,000 వరకు వెళ్లొచ్చు. 25,200 వద్ద క...