భారతదేశం, నవంబర్ 3 -- సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1233 పాయింట్లు పెరిగి 75,693 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 388 పాయింట్లు వృద్ధిచెంది 23,441 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 315 పాయింట్లు పెరిగి 55,002 వద్దకు చేరింది.

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,114.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 392.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50కి 23200- 23120 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇక్కడే 50-డే ఈఎంఏ ఉంది. 23560-23620 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది," అని ఏంజిల్ వన్​కి...