భారతదేశం, సెప్టెంబర్ 10 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 813 పాయింట్లు పడి 74,764 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 204 పాయింట్లు కోల్పోయి 23,431 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 482 పాయింట్లు పడి 56,296 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య అనిశ్చితుల కారణంగా ముడి చమురు ధర భగ్గుమంది. ఫలితంగా ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు ఒత్తిడికి గురవుతున్నాయి.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 582.99 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1509.04 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 90 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

బుధవారం ట్రేడి...