భారతదేశం, జూన్ 12 -- గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 151 పాయింట్లు పడి 73,833 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 53 పాయింట్లు కోల్పోయి 23,162 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 76 పాయింట్లు పెరిగి 55,177 వద్దకు చేరింది.

అమెరికా- ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న సంకేతాల నేపథ్యంలో శుక్రవారం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ఉన్నాయి.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,987.09 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,224.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 290 పాయింట్ల ...