భారతదేశం, జూన్ 15 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1695 పాయింట్లు పెరిగి 75,528 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 461 పాయింట్లు వృద్ధిచెంది 23,623 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1638 పాయింట్లు పెరిగి 56,815 వద్దకు చేరింది.

కాగా అమెరికా- ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, హర్ముజ్​ జలసంధి తెరుచుకుంటుందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన ప్రకటనతో చమురు ధరలు పడ్డాయి. ప్రపంచ స్టాక్​ మార్కెట్​లకు జోష్​ లభించింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,082.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,341.29 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ భారీ లాభాల్లో ప్రార...