భారతదేశం, మే 22 -- Gift Nifty live : గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 135 పాయింట్లు పడి 75,183 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 4 పాయింట్లు కోల్పోయి 23,655 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 123 పాయింట్లు పడి 53,439 వద్దకు చేరింది.

మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,891.21 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,492.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 25 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

"నిఫ్టీ50 డైలీ చార్ట్​లో భారీ రెడ్​ క్యాండిల్ ఏర్పడింది. 23,800 లెవల్ వద్ద కీలక రెసిస్టెన్స్​ని దాటకపోయింది. సూచీ 23,300- 23,8...