భారతదేశం, సెప్టెంబర్ 24 -- బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 299 పాయింట్లు పెరిగి 74,828 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 118 పాయింట్లు వృద్ధిచెంది 23,447 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 333 పాయింట్లు పెరిగి 56,549 వద్దకు చేరింది.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,617.45 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,341.46 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 140 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.68 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.7...