భారతదేశం, మే 6 -- Star Maa New Serial: తెలుగు టీవీ సీరియల్స్ లో సాటిలేని స్టార్ మా ఛానెల్లోకి మరో కొత్త సీరియల్ రాబోతోంది. చాలా రోజులుగా దీని గురించి టీజ్ చేస్తూ వస్తున్న ఆ ఛానెల్ ఇప్పుడు ప్రారంభమయ్యే తేదీని వెల్లడించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజా రవీంద్ర నలుగురు కూతుళ్లకు తండ్రి పాత్రలో నటిస్తున్న ఈ సీరియల్ పేరు గోదావరి. కోనసీమ అందాలను చూపిస్తూ సాగనుంది.

స్టార్ మాలోకి అడుగుపెడుతున్న ఈ కొత్త సీరియల్ గోదావరి వచ్చే సోమవారం అంటే మే 11 నుంచి టెలికాస్ట్ కానుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6.30 గంటలకు ఈ కొత్త సీరియల్ వస్తుంది. ఇప్పటి వరకూ ఆ సమయంలో నిండు మనసులు వస్తుండగా.. ఇప్పుడు గోదావరి పలకరించబోతోంది.

"తండ్రి లేని ఈ అక్కాచెల్లెల్ల జీవితం.. కన్నీళ్లను చిరునవ్వులుగా మార్చుకుంటూ, ఆశలతో ముందుకు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం.. గోద...