భారతదేశం, అక్టోబర్ 23 -- తెలంగాణలో మార్చి 2027లో జరగనున్న పదో తరగతి(SSC), ఓఎస్‌ఎస్‌సీ (OSSC), ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా రుసుము చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారికంగా విడుదల చేసింది. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం పత్రికా ప్రకటన ద్వారా ఈ వివరాలను వెల్లడించింది.

రెగ్యులర్ విద్యార్థులతో పాటు గతంలో తప్పిన విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను చూడండి. ఫైన్ లేకుండా 30-10-2026 నుండి 16-11-2026 వరకు ఫీజు చెల్లించవచ్చు. హెడ్‌మాస్టర్ల ద్వారా సైబర్ ట్రెజరీకి ఫీజు చేయాల్సిన తేదీలు 04-11-2026 నుండి 17-11-2026 వరకు అవకాశం ఇచ్చారు.

రూ. 50 ఆలస్య రుసుముతో 18-11-2026 నుండి 01-12-2026 వరకు చెల్లించవచ్చు. రూ. 20...