భారతదేశం, అక్టోబర్ 16 -- SS Rajamouli: ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ అవేటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న 'వారణాసి' (Varanasi) సినిమాపై రోజురోజుకూ అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ థ్రిల్లర్ నుంచి ప్రతి చిన్న అప్‌డేట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

తాజాగా మలయాళ వర్సటైల్ యాక్టర్-డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఆయనకు అదిరిపోయే బర్త్‌డే విషెస్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయనను సినిమాలో నటిస్తున్న విలన్ పాత్ర పేరు 'కుంభ' (Kumbha) అని సంబోధించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. "హ్యాపీ బర్త్‌డే పృథ్వీ. నీలోని కుంభను ఈరోజు నిద్రలేపాలని అనుకోవడం లేదు. ప్రపంచంపై తనదైన ముద్ర వే...