భారతదేశం, ఏప్రిల్ 18 -- Shah Rukh Khan About Oscars Instagram Post: సినిమా ప్రపంచంలో అత్యున్నత పురస్కారంగా భావించే అస్కార్ అవార్డులను అందించే 'ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్', తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను పోస్ట్ చేసింది. ఇందులో షారుఖ్ ఖాన్ అవార్డు అందుకున్న తర్వాత చెప్పే సుప్రసిద్ధ డైలాగ్ ఉంది.

"ఒక విషయాన్ని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఈ సృష్టి మొత్తం అది మనకు దక్కేలా కుట్ర చేస్తుంది" అనే అర్థం వచ్చేలా ఉన్న హిందీ డైలాగ్‌ను షారుఖ్ ఖాన్ చెప్పాడు. దాన్ని అకాడమీ షేర్ చేస్తూ, "విధి అనేది ఎప్పుడూ గురి తప్పదు" అని క్యాప్షన్ ఇచ్చింది.

దీనిపై షారుఖ్ ఖాన్ తనదైన శైలిలో స్పందించారు. ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. "మరోసారి నన్ను పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. ఇప్పు...