భారతదేశం, జూలై 29 -- Srisailam Devasthanam Board Decisions : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భక్తుల దర్శనాల ప్రక్రియను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చేందుకు దేవస్థానం ధర్మకర్తల మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శ్రీశైల దేవస్థానంలో ప్రొటోకాల్‌ దర్శనాల్లో సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించింది. మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సభ్యులందరితో విస్తృతంగా చర్చించిన అనంతరం ఈ మార్పులను ఖరారు చేశారు.

ఈ కీలక సమావేశంలో 45 అంశాలపై సమగ్రంగా చర్చించి.. అందులో 39 కీలక అంశాలకు ఆమోదముద్ర వేశారు. సాధారణ భక్తులు గంటల తరబడి వేచి ఉండే ఇబ్బందులు తొలగించి, మరింత సులభంగా దర్శనం కల్పించడమే తమ ప్రధాన ధ్యేయమని ధర్మకర్తల మండలి ఛైర్మన్ రమేష్‌ నాయుడు స్పష్టం చేశారు.

ఇక శ్రీశైలం క్షేత్రాభివృద్ధిలో భాగంగా భక్తుల వసతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారు. నూతన...