Srisailam Lakshadeepotsavam : శ్రీశైలంలో లక్షదీపోత్సవ వైభవం - కనులపండువగా పుష్కరిణి హారతి
భారతదేశం, నవంబర్ 24 -- పవిత్ర కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రపంచంలోని సమస్త జీవకోటి సుఖశాంతులతో వర్ధిల్లాలని, లోకకళ్యాణం కోసం ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.
కార్తీక మాస పూజల్లో భాగంగా ఆలయ పుష్కరిణి వద్ద ఈ వేడుకలను ఘనంగా జరిపినట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఎం. శ్రీనివాసరావు తెలిపారు. లక్షదీపోత్సవంలో భాగంగా పుష్కరిణి ప్రాంగణమంతా భక్తులు, అర్చకులు వెలిగించిన లక్ష దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయింది. ఆ దీపాల వె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.