Srisailam Free Bus Service : కార్తీకమాసం వేళ శ్రీశైలం భక్తులకు శుభవార్త - ఉచిత బస్సు సేవలు ప్రారంభం, వివరాలివే
భారతదేశం, నవంబర్ 11 -- Srisailam Free Bus Service : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం శ్రీశైల దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని నవంబరు 10వ తేదీ నుంచి డిసెంబరు 9వ తేదీ వరకు నెల రోజుల పాటు క్షేత్ర పరిధిలో ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) యం. శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు.
కార్తీక మాసంలో దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవి దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత ప్రధాన ఆలయానికి చేరుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.