భారతదేశం, అక్టోబర్ 27 -- Srinidhi Shetty Remuneration: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సంచలన చిత్రం 'కేజీఎఫ్' (KGF Chapter 1 & 2). ఈ ప్రాంచైజీతో రీనా పాత్రలో నటీమణి శ్రీనిధి శెట్టి రాత్రికి రాత్రే పాన్-ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే దేశవ్యాప్తంగా అపారమైన అభిమానులను సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు.

అయితే 'కేజీఎఫ్' సక్సెస్ తర్వాత శ్రీనిధి శెట్టి తన పారితోషికాన్ని విపరీతంగా పెంచేసిందని, ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 7 కోట్ల నుంచి రూ. 8 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలోనూ, ఇండస్ట్రీ వర్గాల్లోనూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి ఈ ప్రచారంపై స్పందిస్తూ అసలు...