భారతదేశం, ఏప్రిల్ 6 -- నిర్మాతలు దర్శకులుగా మారడం, డైరెక్టర్స్ నటులు అవడం, హీరోలు డైరెక్షన్ చేయడం, హీరోయిన్స్ పాటలు పాడటం వంటి ఇంట్రెస్టింగ్ సంఘటనలు సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఓసారి జరుగుతూనే ఉంటాయి. అలాగే, మెయిన్ లీడ్ రోల్ చేయడంతోపాటు స్వీయ దర్శకత్వం వహించిన హీరోలు కూడా ఉన్నారు.

ఈ కోవకే చెందుతుంది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ. అయితే, ఈమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది సినిమా కాదు. ఓ సాంగ్. అదే కొత్త కొత్తగా. బ్యూటిపుల్ హీరోయిన్ శ్రీజ డైరెక్టర్‌గా, నిర్మాతగా మారి రూపొందించిన పాటే కొత్త కొత్తగా. ఈ సాంగ్ ఆల్బమ్‌లో శ్రీజకు జోడీగా దేవగుడి సినిమా హీరో అభినవ్ శౌర్య యాక్ట్ చేశాడు.

కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌కు రఘురాం సంగీతం, సాహిత్యం అందించగా.. సింగర్ లిప్సిక ఆలపించారు. అయితే, ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ రిలీజ్...