భారతదేశం, ఏప్రిల్ 6 -- టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీజ నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సాంగ్ ఆల్బమ్ "కొత్త కొత్తగా". ఈ సాంగ్ లో "దేవగుడి" మూవీ ఫేమ్ అభినవ్ శౌర్య హీరోగా నటించారు. ఈ పాటకు లిరిక్స్, సంగీతాన్ని అందించారు రఘురామ్. సింగర్ లిప్సిక ఈ పాటను పాడారు. కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం (ఏప్రిల్ 4) ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో నిర్మాత డీవై చౌదరి మాట్లాడుతూ.. "శ్రీజ చాలా ప్రతిభావంతురాలు. మేము నిర్మించిన సీరియల్స్‌లో నటించింది. ఇంకా ఏదో సాధించాలనే తపన ఆమెలో కనిపించేది. ఇప్పుడు కొత్త కొత్తగా సాంగ్ ఆల్బమ్‌లో తనే నటించి నిర్మించి, దర్శకత్వం వహించింది. ఈ సాంగ్ చాలా బాగుంది. ఒక మూవీ సాంగ్‌లా రిచ్‌గా రూపొందించింది శ్రీజ. ఆమెతో పాటు అభినవ్ శౌర్యకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా" అని చెప్పారు.

నటి ...