భారతదేశం, ఆగస్టు 16 -- Actor Srihari Son Meghamsh Aasmaan First Look Released: శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం 'ఆస్మాన్'. ఈ సినిమాలో దివంగత నటుడు, రియల్ స్టార్ శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు రామ్ నందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు.

ఆస్మాన్ సినిమా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, అర‌బిక్ భాష‌ల్లో రూపొందుతోంది. స్వ‌ర్గీయ న‌టుడు శ్రీహరి జయంతి సందర్భంగా ఆస్మాన్ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను శనివారం (ఆగస్ట్ 15) నాడు రిలీజ్ చేశారు. ఆస్మాన్ మోష‌న్ పోస్ట‌ర్ వీడియో గ‌మ‌నిస్తే.. సినిమాపై ఆస‌క్తి క‌లుగుతోంది.

పెద్ద అర‌చేయి మ‌ధ్య‌లో హీరో మేఘాంశ్ కాగ‌డా ప‌ట్టుకుని నిల‌బ‌డి ఉన్నా...