భారతదేశం, ఆగస్టు 7 -- Spider Man Brand New Day 8 Days Box Office Collection: హాలీవుడ్ సూపర్ హీరో సినిమాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 'స్పైడర్ మ్యాన్' అనగానే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం వేరే స్థాయిలో ఉంటుంది.

అదే నిజమని నిరూపిస్తూ టామ్ హాలండ్ నటించిన లేటెస్ట్ మార్వెల్ చిత్రం 'స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day) భారత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జులై 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే రికార్డుల వేట మొదలుపెట్టింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, స్పైడర్ మ్యాన్ 4 సినిమా ఎనిమిదో రోజున (గురువారం) ఇండియాలో దాదాపు రూ. 14.20 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. బుధవారం (ఆగస్ట్ 5) నాటి వసూళ్లతో పోలిస్తే 17.6 శాతం తగ్గింది. కానీ...