భారతదేశం, ఆగస్టు 2 -- Palasa Vijayawada Janasadharan Trains : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)కు హాజరయ్యే అభ్యర్థులకు దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. పరీక్షల వేళ అభ్యర్థులు, ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు విజయవాడ డివిజన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలాసా - విజయవాడ స్టేషన్ల మధ్య అన్‌రిజర్వ్‌డ్ జనసాధారణ్ స్పెషల్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సౌకర్యవంతంగా తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 10 జనరల్ క్లాస్ కోచ్‌లతో పాటు 2 ఎస్‌ఎల్‌ఆర్ (SLR) కోచ్‌లతో కలిపి మొత్తం 12 ఐసిఎఫ్ అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి మీదుగా ప్రయాణిస్తాయి. రెండ...