భారతదేశం, సెప్టెంబర్ 3 -- రాబోయే పండగల సీజన్ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రయాణికులకు తీపి కబురు అందించింది. ఉత్తరప్రదేశ్‌లోని సుబేదార్‌గంజ్ (ప్రయాగ్‌రాజ్ సమీపంలో), బెంగళూరులోని యశ్వంతపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు వినాయక చవితి, దసరా, దీపావళి పండగల సమయంలో రద్దీని తగ్గించడానికి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

04135 సుబేదార్‌గంజ్ - యశ్వంతపూర్ ప్రతి శుక్రవారం ఉంటుంది. 11.09.2026 నుండి 04.12.2026 మధ్య 13 సర్వీసులు ఉంటాయి.

04136 యశ్వంతపూర్ - సుబేదార్‌గంజ్ నడుమ ప్రతి సోమవారం ఉంటుంది. 14.09.2026 నుండి 07.12.2026 వరకు 13 సర్వీసులు నడుస్తాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణంలో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. సిర్...