భారతదేశం, ఆగస్టు 6 -- అదనపు రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ కొన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల మీద నుంచి వెళ్తాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు ఈ ట్రైన్ ఉపయోగపడనున్నాయి. కోయంబత్తూరు - జైపూర్, బాంద్రా టెర్మినల్ - వేళంకన్ని, పూరీ - సోలాపూర్ మధ్య వీక్లీ ప్రత్యేక రైళ్లను నడుస్తాయి.

ట్రైన్ నెంబర్ 06181/06182 కోయంబత్తూర్ - జైపూర్ - కోయంబత్తూర్ వీక్లీ ప్రత్యేక రైళ్లు 08 సర్వీసులు నడుస్తాయి. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ దాకా నడవనున్నాయి.

ఈ ప్రత్యేక రైళ్లు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్‌పేటై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గూటి, ధోన్, కర్నూలు సిటీ, గద్వాల్, మహబూబ్‌నగర్, కాచిగూడ, కమరెడ్డి, నిజామాబాద్, బాసర, ముద్ఖేడ్, హజూర్ సాహిబ్ నాందెడ్, పూర్ణ, హింగోలి, వాషిమ్, అకోలా మల్కాపూర్, భుసావల్,...