భారతదేశం, అక్టోబర్ 1 -- దసరా పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు, ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సౌత్ కోస్ట్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి - విజయపుర (కర్ణాటక) నగరాల మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. రేణిగుంట, గుంతకల్లు, గదగ్ మీదుగా నడిచే ఈ ప్రత్యేక రైళ్లు అక్టోబర్ 2026 నెలలో మొత్తం 4 ట్రిప్పులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.

అక్టోబర్ 04, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) నడుస్తుంది. తిరుపతిలో ఉదయం 08.15 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.25 గంటలకు విజయపుర చేరుకుంటుంది.

అక్టోబర్ 4, 2026 నుండి అక్టోబర్ 25, 2026 వరకు ప్రతి ఆదివారం (మొత్తం 4 ట్రిప్పులు) బయలుదేరుతుంది. విజయపురలో రాత్రి 11.35 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతి రోజు స...