భారతదేశం, నవంబర్ 13 -- బంగారంపై పెట్టుబడి పెట్టిన సామాన్య, మధ్యతరగతి ఇన్వెస్టర్లకు నేడు పండగ రోజు! కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జారీ చేసిన 'సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్​బీజీ) 2018-19 సిరీస్-III' కాలపరిమితి నేటితో (నవంబర్ 13) ముగిసింది. ఈ బాండ్ల ఫైనల్ రిడెంప్షన్ ప్రైజ్​ని గ్రాముకు రూ. 14,024గా ఆర్బీఐ ఖరారు చేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఈ బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఊహించని రీతిలో ఏకంగా 348 శాతం వరకు రాబడి దక్కింది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని కుటుంబాలు తరతరాలుగా పసిడి ఆభరణాల కొనుగోలుకే ప్రాధాన్యం ఇస్తుంటాయి. అయితే ఆభరణాలు కొంటే తరుగు, మజూరీ రూపంలో కొంత సొమ్ము నష్టపోవడంతో పాటు భద్రత సమస్య కూడా ఉంటుంది. అలాంటి ఇబ్బం...