భారతదేశం, ఏప్రిల్ 29 -- South Coastal Railway Zone : ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ (South Coastal Railway Zone) కార్యరూపం దాల్చేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఈ కొత్త జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుందని కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు.
విశాఖపట్నంలో జరిగిన గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... రాష్ట్ర రైల్వే మౌలిక సదుపాయాలకు సంబంధించి పలు కీలక విషయాలను పంచుకున్నారు.
కొత్త రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదలవుతుందని మంత్రి స్పష్టం చేశారు. "దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించి జూన్ 1, 2026ని అమలు తేదీగా నిర్ణయించాం. ఆంధ్రప్రదేశ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.