భారతదేశం, ఏప్రిల్ 6 -- దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరిహద్దులు, స్టేషన్ల విషయంపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా తూర్పు కోస్తా రైల్వే జోన్ లో పలు స్టేషన్లు కలపడం, విడదీయడం వంటి నిర్ణయాలతో ఆదాయంపైనా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే (ఎస్సీఓఆర్) జోన్ ప్రధాన కార్యాలయం ఉంటుందని భారతీయ రైల్వే ఆదివారం ప్రకటించింది. సుమారు 50 కిలోమీటర్ల పొడవైన పలాస-ఇచ్చాపురం సెక్షన్ లో ఏడు స్టేషన్లు(పలాస, సుమ్మదేవి, మందాస రోడ్, బరువా, సోంపేట, ఝాడుపూడి,ఇచ్చాపురం.) ఉన్నాయని పేర్కొంది. ఇవన్నీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయని తెలిపింది.ఈ స్టేషన్లలో ఏదీ కూడా ఒడిశా పరిధిలో లేదని పేర్కొంది.

"ఈ స్టేషన్లు ప్రధానంగా ప్రయాణీకుల రద్దీని నిర్వహి...