భారతదేశం, మార్చి 4 -- దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో గత ఐదు సంవత్సరాలలో 102 మంది లోకో పైలట్లు మద్యం సేవించి విధులకు హాజరయ్యారు. 2025లో 22 కేసులను, 2024లో 17 కేసులను అధికారులు గుర్తించారు. ఈ సంఖ్యలు ఈ కాలంలో ఇలా ఉన్నప్పిటకీ.. ఒక లోకో పైలట్‌ను మాత్రమే అధికారులు సస్పెండ్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం అతను గుంటూరు డివిజన్‌కు చెందినవాడు.

పట్టుకున్న వారిలో రక్తంలో ఆల్కహాల్ కంటెంట్(BAC) 100 mlకి 20 mg, 40 mg మధ్య ఉంది. పైలట్లు రైళ్లు ఎక్కడానికి ముందు నిర్వహించిన తప్పనిసరి బ్రీతలైజర్ పరీక్షల సమయంలో అధికారులు ఈ కేసులను గుర్తించారు. దక్షిణ మధ్య రైల్వేలో ఆరు డివిజన్లు ఉన్నాయి. 2025లో గుంతకల్ ఏడు కేసులు, నాందేడ్ ఆరు కేసులు నమోదయ్యాయి.

రైల్వే ప్రయాణికులు ఈ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. లోకో పైలట్లు వేలాది మంది ప్రయాణికులను, భారీ సరుకు...